తెలియని దారుల్లో గమ్యం కోసం..- గమ్యం కోసం తెలిసిన దారుల్లో
అలుపెరుగని శోధన - అర్ధం కాని ఆవేదన
యదలోని ఆవేదనకు లిపి లేదు ...అది అందరికి అర్ధం కాదు...
చీకట్లో కూరుకుపోయిన నాకు
తలుపు తీస్తే వేలుగొస్తుంది అని తెలుసు ..కాని గడియ అవతలి వైపునుండి వేసుంది..
పరిస్థితులు త్రాచుపాములై పగపడితే..పరుగేడుదామన్న కాళ్ళకు పక్షవాతమోచ్చింది..
పెదవుల అంచున ఆగిన మాటలు..
కనుల కొలనులో కలిసిపోయిన కలలు ..
మనసుతో యుద్ధం ప్రకటించిన జ్ఞాపకాలు ..
కొన్ని వెంట వుండేవి ...ఇంకొన్ని వెంటాడేవి.
నా ఒంటరితనానికి - ఏకాంతం తోడు..
నా నిదురకు - ఆలోచనల గోడు..
ప్రశాంతం అంటే అంతం అనిపిస్తోంది.
||అ.నా.రా - నిత్యన్వేషి.||
0 comments:
Post a Comment