My Great Web page
0

Neti Taram (నేటి తరం నాయకులు)


పాలిస్తున్న తల్లితో(భారతమాతతో) -  అప్పుడే బుద్ధి తెలుస్తున్న కొడుకు(రాజకీయనాయకుడు )
కొడుకు:అమ్మ..ఇక నాకు చాలమ్మా..పాలు.
ఇందా ఈ డబ్బాలో పట్టియ్యి ..
అమ్మ:ఎందుకు నాన్న...
అమ్ముకుంటే డబ్బులోస్తాయ్..
అమ్మ:అమ్మతనం రుచి చూద్దామని(చూపిద్దామని)  కన్నానే కాని...
నన్నంముకునే స్థితి చూపిస్తావనుకోలేదురా ...!

- అ.నా.రా 
0

పరిచయం చేయాలంటావా


మనసుకు స్పందన...
స్పందనకు ఊహను 
ఊహకు కోరికను 
కోరికకు ఆశను..
ఆశకు ఆలోచనను 
ఆలోచనకు నన్ను
నాకు నిన్ను  
పరిచయం చేయాలంటావా ??
అ.నా.రా 
27/12/12

0

ప్రశాంతం అంటే అంతం అనిపిస్తోంది


తెలియని దారుల్లో గమ్యం కోసం..- గమ్యం కోసం తెలిసిన దారుల్లో
అలుపెరుగని శోధన - అర్ధం కాని ఆవేదన 
యదలోని ఆవేదనకు లిపి లేదు ...అది అందరికి అర్ధం కాదు...
చీకట్లో కూరుకుపోయిన నాకు 
తలుపు తీస్తే వేలుగొస్తుంది అని తెలుసు ..కాని గడియ అవతలి వైపునుండి వేసుంది..
పరిస్థితులు త్రాచుపాములై పగపడితే..పరుగేడుదామన్న కాళ్ళకు పక్షవాతమోచ్చింది..
పెదవుల అంచున ఆగిన మాటలు..
కనుల కొలనులో కలిసిపోయిన కలలు ..
మనసుతో యుద్ధం ప్రకటించిన జ్ఞాపకాలు ..
కొన్ని వెంట వుండేవి ...ఇంకొన్ని వెంటాడేవి. 
నా ఒంటరితనానికి - ఏకాంతం తోడు..
నా నిదురకు - ఆలోచనల గోడు..
ప్రశాంతం అంటే అంతం అనిపిస్తోంది.
||అ.నా.రా - నిత్యన్వేషి.||

0

Andhulo emundhi.?


అందులో ఏముంది..?
ఆనందం..
ఏంటో అది..?
నీకు అర్ధం కానిది..నాకు అర్ధమయ్యేది.
అర్ధం కాలేదు..!!?
అదే కదా నేను చెప్పింది..
-అ.నా.రా